Site icon Prime9

New born Baby: అచ్యుతాపురం సెజ్‌లో దారుణం.. క్వాంటమ్ కంపెనీ బాత్రూమ్‌లో నవజాత శిశువు

Baby

Baby

Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ క్యాంటమ్ కంపెనీలోని బాత్రూమ్ లో నవజాత శివువు కలకలం రేపింది. క్వాంటమ్ కంపెనీలో పని చేస్తున్న ఓ మహిళే ఆ బిడ్డను బాత్రూంలో ప్రసవించినట్లు తెలుస్తోంది. పెళ్లి కాకుండా బిడ్డ పుట్టడం వల్లే అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు సిబ్బంది భావిస్తున్నారు. ఆ బిడ్డను ప్రసవించిన మహిళ ఎవరో తెలుసుకునేందుకు యాజమాన్యం కంపెనీకి వెళ్లే బస్సుల్లో తనిఖీలు చేస్తోంది. శిశువును చైల్డ్ లైన్ కు అప్పగించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది నవజాత శిశువును తమతో పాటు తీసుకెళ్లారు. అనంతరం యాజమాన్యం పోలీసులకు కూడా విషయాన్ని తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు అప్పుడే పుట్టిన బిడ్డను టాయ్‌లెట్‌లో వదిలి వెళ్లిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ధన్‌బాద్ – అలెప్పీఎక్స్‌ప్రెస్ రైలులో ఓ గుర్తు తెలియని మహిళ రైలులోనే ప్రసవించింది. అనంతరం పుట్టిన బిడ్డను రైలు టాయ్‌లెట్‌లో వదిలి వెళ్లగా మిగతా ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్‌పీఎఫ్‌ జీఆర్‌పీ పోలీసులు రైలులోని శిశువును కాపాడి, రైల్వే ఆసుపత్రికి తరలించారు.

తమిళనాడులోని తంజావూరు మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో కొన్ని రోజుల క్రితం ఒక పారిశుధ్య కార్మికుడు ఆస్పత్రి బాత్ రూమ్ క్లీనింగ్ చేసేందుకు వెళ్ళాడు. అక్కడ టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ సరిగా పనిచేయడం లేదు. దీంతో అతను దానిని తెరవడానికి ప్రయత్నించారు. మూత గట్టిగా వేసి ఉంది. కాసేపు ప్రయత్నించడంతో మూత తెరవగలిగాడు. ఆ ఫ్లష్ ట్యాంక్ లో ఒక పసిబిడ్డ మృతదేహం కనిపించింది. వెంటనే అతను ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశాడు.

Exit mobile version