Site icon Prime9

Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ మళ్ళీ వాయిదా..

Nara Chandrababu Naidu squash petition on supreme court

Nara Chandrababu Naidu squash petition on supreme court

Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు.. మరోవైపు కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ ఏపీ హైకోర్టును కోరుతున్నాయి. నిన్న వీరి వాదనలను విన్న కోర్టు నేడు ఈ పిటిషన్ లపై విచారణ జరపనుంది. ఇక మరోవైపు చంద్రబాబుకు బెయిల్ ఈవ్యవలని కోరుతూ పెట్టిన పిటిషన్ ని ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దాంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బాబు తరపు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్‌ ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడికానుంది.

సోమవారం జరిగిన వాదనల్లో.. క్వాష్ పిటిషన్‌పై త్వరగా పూర్తి విచారణ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా అడిగారు. చంద్రబాబు నాయుడు ఎన్నిరోజులుగా జైల్లో ఉన్నారని సిజెఐ చంద్రచూడ్ ఆరా తీశారు. 8న అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. రేపు మరోసారి మెన్షన్ చేయాలని లూథ్రాకి సిజెఐ సూచించారు. అత్యవసరం ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్‌ స్లిప్‌ ఇచ్చామని, పిటిషనర్‌ కస్టడీలో ఉన్నారని సిద్ధార్థ లూథ్రా చెప్పారు. ఈ నెల 28నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకి సెలవులున్నాయి. విచారణ వాయిదా పడినా లేదా ఆలస్యం అయినా చంద్రబాబు కేసు అక్టోబర్ 3 తరువాతే తేలే అవకాశాలుంటాయి.

మరో వైపు సోమవారం నాడు చంద్రబాబును ఐదు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు సూచించింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌, సీఐడీ తాజాగా దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కలిపి ఒకేసారి విచారించి, రెండింటిపై ఒకేసారి నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. వాదనలు వినేందుకు విచారణ నేటికి వాయిదా వేసింది.

Exit mobile version