Site icon Prime9

Nara Chandrababu Naidu : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..!

judgements on different cases over Nara Chandrababu Naidu

judgements on different cases over Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అదే రోజు వాదనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.. తనపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని పేర్కొంటూ క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం విదితమే.

కాగా, సుప్రీంకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ ఈ రోజు వాడివేడిగా వాదనలు జరిగాయి. ముందుగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే .. అనంతరం సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే, ఇరు వర్గాల వాదనలు విన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు శుక్రవారం ఎలాంటి విచారణ సాగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version