Nara Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హౌస్ కస్టడీ పిటిషన్ విషయంలో ఊహించని షాక్ తగిలింది. జ్యుడీషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలన్న చంద్రబాబు పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై నిన్న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రతను చూపిస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు వయసు, హోదా, ఆయనకు ఉన్న భద్రత వంటి అంశాలతో హౌస్ రిమాండ్ కు అంగీకరించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా న్యాయస్థానాన్ని కోరారు. అయితే, చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ కు సీఐడీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబుకి అన్ని విధాలుగా జైలే ఉత్తమం అని సీఐడీ వాదించింది. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఆయనకు పూర్తి భద్రతను కల్పించామని.. ఈ జైల్లో ఆయనకు ఎలాంటి ముప్పులేదన్న సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. దాంతో చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టివేసింది.