Site icon Prime9

Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబుకు షాక్.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Nara Chandrababu Naidu bail petition got post poned

Nara Chandrababu Naidu bail petition got post poned

Nara Chandrababu Naidu : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. గత శనివారం అరెస్టైన చంద్రబాబు వారం రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఆయనకు ఈ కేసులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ విజయవాడ అనిశా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని.. కోర్టు ఆదేశించింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతరబెయిల్‌పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. తన పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Exit mobile version