Site icon Prime9

Nara Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా.. ఆ విషయంలో వైకాపా సర్కారుపై ఫైర్ అయిన నారా భువనేశ్వరి

Nara Chandrababu naidu bail petition again postponed

Nara Chandrababu naidu bail petition again postponed

Nara Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెదేపా చీఫ్ చంద్రబాబుకు మళ్ళీ చుక్కెదురైంది. కాగా ఏసీబీ కోర్టులో.. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ విచారణ వాయిదా పడగా.. తాజాగా ఈ పిటిషన్ పై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టింది. ఆపై కేసు విచారణను ఈ నెల 19 (గురువారం) కి వాయిదా వేసింది. అయితే స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

ఇక మరోవైపు చంద్రబాబును అరెస్టు చేయడానికి నిరసనగా రాజమండ్రిలోని జైలు వద్ద నేటి నుంచి రెండు రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు, భువనేశ్వరిని కలిసి సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ వర్గాలకు అనుమతించబోమని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.

కాగా తాజాగా పోలీసుల తీరుపై నారా భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆ పోస్ట్ లో.. నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? అంటూ ప్రశ్నించారు. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది..? అని నిలదీశారు.. బాధలో ఉన్న అమ్మను కలుస్తామంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడమేంటీ..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ ఫైర్ అయ్యారు.

 

Exit mobile version