Nara Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు..

తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా గత నెల 9 వ తేదీన ఆయనను అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతుండడం

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 05:05 PM IST

Nara Chandrababu Naidu : తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా గత నెల 9 వ తేదీన ఆయనను అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతుండడం, వాయిదా పడడం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబుకు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఇక మరోవైపు ఈ కేసులో ఆయనను సీఐడీ కస్టడీకి కూడా ఇవ్వలేమని పేర్కొంది. ఇప్పటికే చంద్రబాబును పలుమర్లు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వగా.. నేడు మళ్ళీ కస్టడీకి ఇవ్వలేమని కోర్టు తీర్పునిచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రూ.300 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఏపీ సీఐడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ చేసిన ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లను కొట్టివేసింది.

మరోవైపు ఫైబర్‌నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, అంగళ్లు కేసు వ్యవహారంలో బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు ఉదయమే కొట్టివేసింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై కీలక వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు. తాను ఈ విషయమై వాదనలు రేపు వినిపిస్తానని ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహ సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. రోహత్గీ అభ్యర్ధనను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దాంతో ఈ పిటిషన్ రేపటికి వాయిదా పడింది.