Site icon Prime9

Nara Bhuvaneswari : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి.. రేపటి నుంచి “నిజం గెలవాలి”

Nara Bhuvaneswari visits tirumala along with tdp leaders

Nara Bhuvaneswari visits tirumala along with tdp leaders

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆమె ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భువనేశ్వరికి స్వాగతం పలకగా.. దర్శనం అనంతరం వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరితో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

స్వామిని దర్శించుకున్న తర్వాత నారావారిపల్లెకు భువనేశ్వరి వెళ్లారు. నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద ఆమె పూజలు చేయనున్నారు. అక్కడ నాగాలమ్మ, దొడ్డిగంగమ్మలకు పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా బుధవారం నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర బుధవారం ఉదయం చంద్రగిరిలో ప్రారంభం కానుండగా.. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగుతుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి ఈ యాత్ర ద్వారా మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శించానున్నారు. ఈ క్రమంలో స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ నారా భువనేశ్వరి పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం అందుతుంది.

 

 

Exit mobile version