Site icon Prime9

Nara Bhuvaneswari : “నిజం గెలవాలి” యాత్ర స్టార్ట్ చేసిన నారా భువనేశ్వరి..

Nara Bhuvaneswari nijam gelavali bus tour started

Nara Bhuvaneswari nijam gelavali bus tour started

Nara Bhuvaneswari : తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా నారావారిపల్లెలో ఆమె తండ్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ముందుగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎ.ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. వారు ధైర్యంగా ఉండాలని.. కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. తర్వాత నేండ్రగుంట చేరుకుని మృతిచెందిన తెదేపా కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. వారానికి మూడు రోజులపాటు ఈ యాత్ర జరగనుంది. పరామర్శలతో పాటు స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొననున్నారు.

Exit mobile version