Nallari Kiran Kumar Reddy: కాంగ్రెస్ సీనియర్ నేల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకుప్పారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు సీనియర్ నేతలు అరుణ్ సింగ్ , లక్ష్మణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరి ప్రారంభిస్తున్నారని ప్రహ్లాద్ జోషి చెప్పారు. దీంతో ఏపీలో తమ పార్టీ బలోపేతం అవుతుందన్నారు.
#WATCH | “I had never imagined that I’ll have to leave Congress…There is a saying- ‘My king is very intelligent, he doesn’t think on his own, doesn’t listens to anyone’s advice’, “says former Congress leader Kiran Kumar Reddy on joining BJP in Delhi. pic.twitter.com/8s43F09WxK
— ANI (@ANI) April 7, 2023
బీజేపీలో కీలక బాధ్యతలు(Nallari Kiran Kumar Reddy)
కొద్ది రోజుల క్రితమే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధికారికంగా రాజీనామా చేశారు. బీజేపీలో కిరణ్ కుమార్ కి కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా, గత కాంగ్రెస్ గవర్నెంట్ లో కిరణ్‌కుమార్‌రెడ్డి అనేక పదవులు చేపట్టారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పని చేశారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ పనిచేశారు.
శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్.. ఇప్పుడు బీజేపీలో చేరారు.