Delhi: ఎంపీ రఘురామ వ్రాసిన లెటరులో ఏపీ మంత్రులు హైకోర్టు తీర్పుకు విరుద్దంగా మూడు రాజధానులపై మాట్లాడుతున్నారన్నారు. వెంటనే కోర్టు తీర్పు మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్నప్తి చేశారు. నేడు రెండవ విడుత చేపడుతున్న రైతుల మహా పాదయాత్ర రాజధానిగా అమరావతినే కొనసాగించలన్న ఆలోచన ప్రభుత్వానికి కలగాలన్నదే ప్రధాన ఉద్ధేశమని పేర్కొన్నారు. గతంలో కూడా న్యాయస్ధానం టు దేవస్ధానం అంటూ పాదయాత్ర చేపట్టిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.
అభివృద్దిని మరిచిన మంత్రులు అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. రైతుల యాత్రలో అలజడి సృష్టించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పాదయాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేకించి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని వైసిపి రెబల్ ఎంపీ కోరారు.
మొత్తం మీద అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రను అడ్డుకొనేందుకు వైసీపి నేతలు యత్నాస్తున్నారని ఎంపీ రఘురామ చెప్పడం పట్ల ప్రభుత్వం అప్రమత్తమౌతుందో లేదా పోలీసింగ్ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందో కాలమే నిర్ణయించాలి.