Site icon Prime9

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురు

Anantha Babu

Anantha Babu

MLC Anantha Babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురయింది. అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్ట్ డిస్మిస్ చేసింది.గతంలో అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయగా.ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షిట్ వేయనందున బెయిల్ ఇవ్వాలని హైకోర్టును వైసీపీ ఎమ్మెల్సీ కోరారు.బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. వాదనలు విన్న అనంతరం పిటిషన్ ను కొట్టివేసింది. తాము మూడు నెలల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేశామని, అయితే సాంకేతిక కారణాల వల్ల తిప్పి పంపినట్లు హైకోర్టుకు పోలీసులు తెలిపారు. పోలీసులు, అనంతబాబు తరపు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

కాగా ప్రస్తుతం సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో మూడుసార్లు అనంతబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా చుక్కెదురైంది. ఇటీవల బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఆయనకు చుక్కెదురయింది.

Exit mobile version