Missing Case : చిత్తూరు జిల్లాలో ఒకే రోజు నలుగురు అమ్మాయిల కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా అమ్మాయిలకు రక్షణ కరువైన విషయం తెలిసిందే. బయట వ్యక్తుల నుంచే కాకుండా.. ఇంట్లోని వ్యక్తుల నుంచి కూడా ఆడ పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ఈ తరుణంలో ఒకే రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో అమ్మాయిలు కనబడకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఘటనలపై పోలీసులను ఆశ్రయించిన వారి వారి తల్లిదండ్రులు వారి ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నారు. అమ్మాయిల మిస్సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో పోలీసులు అమ్మాయిల ఆచూకీ వెతికే పనిలో ఉన్నారు.
కనిపించకుండా పోయిన అమ్మాయిల వివరాలు (Missing Case)..
తిరుపతి జిల్లా నారాయణ వనంకు చెందిన మౌనిక మంగళవారం నుంచి కనిపించడంలేదు.
జిల్లాలోని పుంగనూరుకు చెందిన ఝూన్సీ కూడా మంగళవారం నుండి కనిపించడం లేదు.
స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే రితిక నిన్నటి నుండి కనిపించడం లేదు.
అదే విధంగా జిల్లాలోని వి.కోట ప్రాంతానికి చెందిన కోమల..
చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో పాటు బంధువుల ఇంటికేమైనా పోయిందేమోనని కుటుంబసభ్యులు ఆరా తీసారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయిలను ఎవరైనా కిడ్నాప్ చేసి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక అమ్మాయిలే ఎక్కడికైనా వెళ్ళారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ అమ్మాయిల కోసం గాలిస్తున్నారు. నలుగురు అమ్మాయిలను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.