Amaravati: ఎన్టీఆర్ పేరు మార్పుతో నందమూరి కుటుంబాన్ని రోడ్డుకు లాగాలన్నదే వైకాపా ప్రభుత్వ లక్ష్యంగా మంత్రులు కార్యచరణ గుప్పిస్తున్నారు. నిన్నటి దినం నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పై శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులని విమర్శించారు.
దీంతో మంత్రి జోగి రమేష్ బాలకృష్ణ పై విరుచుక పడ్డారు. సీఎం జగన్ ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి ఆయన గౌరవాన్ని నిలిపారని కితాబులిచ్చారు. మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మాజీ సీఎం చంద్రబాబునే నిలదీయాలంటూ బాలకృష్ణను మంత్రి డిమాండ్ చేశారు. సిగ్గు, శరం లేకుండా నారా కుటుంబానికి కేరాఫ్ అడ్రస్సుగా నందమూరి కుటుంబం మారిందని ఆరోపించారు. ఆరోగ్య వర్శిటీ అనేది చాలా చిన్న అంశంగా జోడి రమేష్ కొట్టి పారేసారు.
ఎన్టీఆర్ పేరు అనేది కోట్లాది మంది మదిలో నిలిచిపోయిన పేరు. నందమూరి కుటుంబంలోని పలువురు వర్శిటీ పేరు మార్పు పై ఖండించారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గోడ మీద పిల్లిలా ఎన్టీఆర్, వైఎస్సార్ అంటూ ట్వీట్ చేసి అభిమానులు, ప్రజల మద్య నవ్వుల పాలైనాడు. వైకాపా మాత్రం నందమూరి వంశస్థులను చంద్రబాబు సాకున ఇరుకున పెట్టాలనేది ఓ మైండ్ గేమ్ గా ఆటలాడుతుంది.
జగన్ ప్రభుత్వం వైద్యశాఖ పై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను ప్రతిపక్షాలు గమనించడం లేదన్న మంత్రి రజనీ ఇజ్జత్ ను మరో మంత్రి అప్పల్రాజు ఈ రోజు డామేజ్ చేసారు. పలాసా వైద్యశాలలో సిబ్బంది పనితీరు బాధ్యతారాహిత్యం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి సీఎం జగన్ పరువును ఆయనే రోడ్డెంకించారు.
ఇదీ చదవండి: డాక్టర్లు లేకపోవడంతో మంత్రి అప్పల్రాజు దిగ్భ్రాంతి