Andhra Pradesh: ఉత్తరాంధ్ర మంత్రులకు 3 రాజధానుల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారే గాని, ప్రజల్లో మాత్రం దానిపై ఏ మాత్రం స్పందన రావడం లేదు. అలాంటి ఓ వింత పరిస్ధితి మంత్రి ధర్మాన ప్రసాదురావుకు గడప గడప కార్యక్రమంలో చోటుచేసుకొనింది. ఆ ఘటన ఆయన్ను ఒకింత అసహనానికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్లితే, శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గడప గడపకు కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదురావు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల గురించి తొలుత మాట్లాడారు. అనంతరం 3 రాజధానుల అంశం పై మాట్లాడిన మంత్రి ధర్మాన సమావేశానికి వచ్చిన ప్రజలను విశాఖ రాజధానిగా మద్దతుగా గొంతెత్తి అరవాలని వారికి సూచించారు. అది కూడా నేను మన రాజధాని అంటాను, తర్వాత మీరు విశాఖపట్నం అనాలని వారితో అన్నాడు.
అదే విధంగా మన రాజధాని అన్న మంత్రి మాటలకు సభకు వచ్చినవారి నుండి పెద్దగా స్పందన రాలేదు. దీంతో అసహనానికి గురైనా మంత్రి మీరు అరిస్తేనే గదా రాజధాని వచ్చేది. ప్రభుత్వానికి తెలిసేది అంటూ వారితో అన్నాడు. మూతి బిగపట్టుకొని కూర్చొంటే వాస్తవాలు ప్రభుత్వానికి ఎలా తెలుస్తాయోనని వచ్చిన వారిపై విసుగును ప్రవర్శించారు. రాజధానితో అవసరమైన ఉద్యోగాలు వస్తాయన్నారు. కుటుంబాల్లో స్థానిక ఉద్యోగాలు వస్తాయని తెలుసుకోవాలని వారితో అన్నారు. అయినా కూడా వారిలో పెద్దగా చలనం రాలేదు. దీంతో ఏం మాట్లాడాలో అర్ధం కాక తన ప్రసంగాన్ని మంత్రి కొనసాగించారు.
ఒక దశలో ఎవరైతే మూడు రాజధానులకు మద్ధతుగా మాట్లాడరో, వారంతా శ్రీకాకుళం వ్యతిరేకులే అని సభలో మంత్రి రెచ్చగొట్టినా ఫలితం మాత్రం శూన్యంగానే మారింది. మంత్రి మాట్లాడుతున్న సమయంలో సభకు వచ్చిన వారు నవ్వుకోవడమే వారి వంతైంది.
ఇది కూడా చదవండి: పవన్…విశాఖ పర్యటన వాయిదా వేసుకో…మంత్రి అమర్నాధ్