Site icon Prime9

Mekapati Chandrasekhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నేనే మూడో పెళ్ళాం.. ఇదిగో ప్రూఫ్

mekapati chandrasekhar reddy have son proofs revealed by his third wife

mekapati chandrasekhar reddy have son proofs revealed by his third wife

Mekapati Chandrasekhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని.. తన చిన్నప్పుడే తనను, తన తల్లిని ఆయన వదిలేసివెళ్లాడని, తన చదువు పూర్తి అయ్యి, వివాహం అయ్యి, తనకి కొడుకు పుట్టే సమయంలో కూడా తన తండ్రిని (మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని) మిస్ అయ్యాను అని అని గతవారం మేకపాటి శివ చరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఈ విషయం వైరల్ అయిన వెంటనే దీనిపై మేకపాటి స్పందిస్తూ డబ్బు కోసమే మేకపాటి శివ చరణ్ రెడ్డి తన తల్లితో కలిసి డ్రామాలు ఆడుతున్నాడని, తనకి ఇద్దరే భార్యలు అని ఆయన తెలిపారు. కాగా, తాజాగా శివ చరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి తెరపైకి వచ్చారు.

ఆయనే వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు

తాను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrasekhar Reddy)  వెనక పడలేదని, ఆయనే తన మామయ్య, చిన్నాన్నని పట్టుకుని ఆయనే పెళ్లి చేసుకుంటా అని ఇంటి చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుని తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టాడు అని, తర్వాత శాంతకుమారి అనే ఆవిడ పరిచయం అవడంతో ఇంటికి రావడం తగ్గించాడు అని, అనుమానం వచ్చి అడిగితే ఆ విషయం శాంతాకుమారితో చెప్పాడని ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చింది లేదని ఆవిడ చెప్పారు.

నాకు కావాల్సింది గుర్తింపు

శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ డబ్బుకోసం అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని (నాన్న అని సంబోధిస్తూ) అడిగేవాడిని అని, తనకి డబ్బు అక్కర్లేదని, తనకి గుర్తింపు కావాలని చెప్తూ, ప్రూఫ్ గా ( S/O మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్న) డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ని చూపించారు. వీటిలో నిజానిజాలు ఏంటో తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్

Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..

KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version