Site icon Prime9

ఈ మాచర్ల దాడి ఘటనలో ఎవరు? ఎవరిపై దాడి చేస్తున్నారో ఫ్యాక్ట్ చెక్…

macherla ycp and tdp leaders fight incident fact check

macherla ycp and tdp leaders fight incident fact check

Macherla Attack : పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పాలి. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయి నుంచి కర్రలు, రాడ్లు, బండరాళ్ళు తో దాడికి దిగే వరకు రావడం అందరికీ షాక్ ఇస్తుంది. రాత్రి జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించారు. మళ్ళీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ రవి శంకర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మాచర్లలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉంది.

సాయంత్రం సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ తరుణంలోనే ఇరుపార్టీ నేతలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగారు. అది కాస్తా చివరకు తీవ్ర రూపం దాల్చి తారాస్థాయికి చేరింది. కాగా ఆ ఘటనలో వైఎస్సార్‌ సీపీకి చెందిన కార్యకర్తలు గాయపడ్డ ముగ్గురినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తమ వారిని దారుణంగా కొట్టడం, దాదాపుగా హతమార్చే ప్రయత్నం చేయటం పట్ల వారి బంధుమిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాడి చేసిన వ్యక్తి ఎవరంటే…

ముఖ్యంగా ఒక పడిపోయిన వ్యక్తిపై వేరే వ్యక్తి బండరాయి వేయడం , ఆ తర్వాత కూడా వేరే వ్యక్తి కర్రతో దాడి చేసేందుకు యత్నించిన ఘటన అందరిని విస్మయానికి గురి చేస్తుంది. సోషల్ మీడియా లో సైతం చక్కర్లు కొడుతున్న ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ… ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారని స్పందిస్తున్నారు. కాగా ఆ దాడిలో గాయపడిన వ్యక్తి వైకాపా కార్యకర్త చల్లా మోహన్ గా తెలుస్తుంది. అతనిపై బండరాయితో దాడి చేసిన వ్యక్తి టీడీపీకి చెందిన నేతగా భావిస్తున్నారు. అతని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎదుట ఉన్నది కూడా మనిషే విషయాన్ని మర్చిపోయి అంతా కర్కశంగా ప్రవర్తించడం పట్ల అందరూ పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే పల్నాడు జిల్లాలో పార్టీల కోసం హత్యలు జరిగిన ఘటనలు గమనించవచ్చు. రాజకీయాల కోసం మనుషుల ప్రాణాలను తీయడం ఎంత వరకు సబబు అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి.

వైసీపీ, టీడీపీ నేతల స్పందన…

కాగా రాత్రి జరిగిన దాడుల్లో బ్రహ్మారెడ్డి ఇంటితో పాటు మరో టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు. అలాగే పలు వాహనాలను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. మాచర్లలో జరిగిన గొడవలకు ఫ్యాక్షన్ మూలాలే కారణమని ఎస్పీ రవి శంకర్ తెలిపారు. వెల్దుర్తి చుట్టుప్రక్కల గ్రామాలలో హత్యకేసులో ఉన్న ముద్దాయిలే మాచర్లకు వచ్చారని ఎస్పీ చెప్పారు. చంద్రబాబు ప్లాన్ బిలో భాగమే ఈ దాడులని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ ఉద్దేశ పూర్వకంగానే దాడికి పాల్పడిందని చెప్పారు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి. ముందస్తుగా సమాచారం ఇచ్చినా దాడులు అడ్డుకోవటంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ దాడి ఘటనపై చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా స్పందించారు.

Exit mobile version