Site icon Prime9

Nara Lokesh in 365 days padayatra: 365 రోజుల పాదయాత్రకు లోకేష్ బాబు సై…జనవరి 27న ప్రారంభం?

Lokesh Babu is ready for a 365-day padayatra...starting on January 27

Kuppam: వైకాపా పాలనలో ప్రజలు పడుతున్న బాధలు ఓవైపు, మరో వైపు సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 365రోజుల పాదయాత్రకు రంగం సిద్ధమైంది. 2023 జనవరి 27న పాదయాత్ర చేపట్టేలా ప్రణాళిక సిద్దం చేసుకొంటున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ దయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగనుంది. ఇప్పటికే పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల రీత్యా పాదయాత్రను 2023లో లోకేష్ చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి: Fire Accident: ఏపీలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం

Exit mobile version