Site icon Prime9

Latest Palnadu News : పల్నాడు జిల్లాలో కన్న కొడుకుని కిరాతకంగా చంపిన తండ్రి.. తల – మొండెం వేరు చేసి !

Latest Palnadu News about father brutally killing son in gundlapalli village

Latest Palnadu News about father brutally killing son in gundlapalli village

Latest Palnadu News : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లిలో దారుణం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న బత్తుల వీరయ్య (45)  కన్న కొడుకు కిషోర్ అలియాస్ అశోక్ (25) ను అతి కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపుతుంది. అనంతరం తలను మొండెం నుంచి వేరు చేసి.. గోతంలో వేసుకుని గ్రామంలో తిరిగాడని గ్రామస్తులు చెప్పడం మరింత భయబ్రాంతులకు గురి చేస్తుంది.  కాగా నిందితుడిని నకరికల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి.. కిషోర్ మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కిషోర్ తల్లి బత్తుల అలివేలు గల్ఫ్ దేశంలో సంపాదన కోసం పనులు చేసేందుకు వెళ్లి అక్కడి నుండి కొడుకు కిషోర్ కు డబ్బులు పంపుతోందని తెలుస్తుంది.

అయితే మందుకు బానిసైన నిందితుడు వీరయ్య కొడుకును మందు కోసం తరచూ డబ్బులు అడుగుతుండటంతో కొడుకు ఇవ్వలేదని.. ఆ కోపం తోనే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు. కాగా  కిషోర్ తండ్రి వీరయ్య చేతిలో హత్యకు గురైన విషయాన్ని గ్రామస్థులు తల్లికి సమాచారం అందించారు. దీంతో కువైట్‌లో ఉంటున్న మృతుని తల్లి బత్తుల అలివేలు వీడియో కాల్ లో బంధువులతో మాట్లాడుతూ.. విపరీతంగా రోధిస్తుంది.

కుటుంబంలో కొడుకు, కూతురుకు పెళ్లిళ్లు చేయడంతో 5 లక్షలు అప్పులయ్యాయని.. అందుచేతనే అప్పు తీర్చేందుకు కువైట్ లో పనులు చేసుకునేందుకు రెండు సంవత్సరాల ఒప్పందంపై వచ్చానని వాపోయింది. అయితే తన కుమారుడు భర్త చేతిలో మృతి చెందాడని తెలిసినప్పటి నుంచి తీవ్ర ఆవేదనకి గురైనట్లు వివరించింది. చివరి సారిగా అయినా కుమారుని మృత దేహాన్ని చూసుకోవాలని ఉందని.. కానీ అక్కడి యజమాని ఒప్పుకోవడం లేదని కన్నీరు మున్నీరు అవుతుంది. ఎలాగైనా తనను ఇక్కడి నుండి భారత్ కి తీసుకువచ్చే విధంగా చేయాలని ఆమె వేడుకుంటోంది. ఈ విషాదకర ఘటనతో గుండ్లపల్లి గ్రామం (Latest Palnadu News) అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

Exit mobile version