Site icon Prime9

Students : గుడివాడలో దారుణ ఘటన.. విద్యార్ధులతో మూత్రశాలలు కడిగించిన హెచ్ఎం

latest news about students cleaning washrooms in school at gudiwada

latest news about students cleaning washrooms in school at gudiwada

Students : కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన జరిగింది. స్థానిక ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో చదివే విద్యార్థులతో ఆమె మూత్రశాలలు కడిగించిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. అలానే వంట సిబ్బంది రాని సమయంలో కూడా వండిన పాత్రలను పిల్లలే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొందరు పిల్లలు వడ్డిస్తుంటే మరికొందరు భోజనం చేసే పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయురాలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ అయ్యాయి. అవి తల్లిదండ్రులకు చేరడంతో వారు ఆమెను ప్రశ్నించారు. విద్యార్థులు చిన్న చిన్న పనులు చేస్తే తప్పు ఏంటని ఆమె వారికే ఎదురు సమాధానం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అయితే ఈ విషయం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు దృష్టికి వెళ్లింది. దీంతో పిల్లలతో మూత్రశాలలు కడిగించిన ఘటనపై విచారణ చేపట్టాలని డీఈవోను ఆదేశించారని తెలుస్తోంది. కాగా.. ఆ హెచ్ ఎం తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె విషయంలో ఫిర్యాదు చేశామని, అయినా ఫలితం లేకుండా పోయిందని వారు తెలిపారు. పిల్లల చేత పనులు చేయిస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version