Site icon Prime9

Jc Prabhakar Reddy : తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి.. అర్ధరాత్రి నుంచి నిరసన చేపట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. బ్రష్, స్నానం కూడా !

jc prabhakar reddy protest creating critical situations in tadipatri

jc prabhakar reddy protest creating critical situations in tadipatri

Jc Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి మొదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుందని.. దానిని అడ్డుకుంటామని జేసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాహనాలకు నిప్పు పెడతామని ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఇంటి వద్దే నిరసన చేపట్టిన జేసీ.. కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అర్థరాత్రి సమయంలో మున్సిపల్ కార్యాలయంలో మంచం వేసుకొని పడుకొని నిరసన తెలిపారు. ఆడే విధంగా ఉదయాన్నే కార్యాలయం ఆవరణలోనే బ్రష్ చేసి, స్నానం చేసి నిరసన తెలిపారు. కమిషనర్ వచ్చి మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలకు సమాధానం చెప్పేంత వరకు నిరసన కొనసాగిస్తానని జేసీ వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇక సోమవారం నాడు మున్సిపాలిటీలో డీజిల్, టైర్ల అపహరణపై మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ.. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంకు వెళ్తున్న జేసీప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని గృహనిర్భందం చేశారు. దీనికి నిరసనగా ఆయన ఇంటి ముందు కాలేజీ కాంపౌండ్ పై పడుకొని నిరసన చేపట్టారు. సోమవారం అర్థరాత్రి వరకు జేసీ నిరసన కొనసాగింది. జేసీని ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు సూచించినా జేసీ ప్రభాకర్ రెడ్డి తన నిరసనను కొనసాగించారు. దీంతో పోలీసులు జేసీని బలవంతంగా ఇట్లోకి పంపించే ప్రయత్నం చేడంతో పోలీసులకు, జేసీ అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరికి ప్రభాకర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా లాకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో ఆయన కొంత మేర అస్వస్థతకు గురయ్యారని జేసీ సహచరులు తెలిపారు.

కాగా ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన ఏకైక  మున్సిపాలిటీ  తాడిపత్రి.  తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి గతంలో  జేసీ ప్రభాకర్ రెడ్డి,  జేసీ దివాకర్ రెడ్డిలు  ప్రాతినిథ్యం వహించారు.  మున్సిపాలిటీ పరిధిలో  వైసీపీ కంటే టీడీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి  ఎన్నికయ్యారు

Exit mobile version