JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా కార్యకర్తలు సైతం అక్కడికి భారీగా చేరుకుంటున్నారు.
జేసీ గృహనిర్బంధం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా కార్యకర్తలు సైతం అక్కడికి భారీగా చేరుకుంటున్నారు.
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గత కొలంగా తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక రవాణా యథేచ్చగా సాగుతుండటంతో.. దానిని అడ్డుకుంటామని జేసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాహనాలకు నిప్పు పెడతామని ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముందుస్తు జాగ్రత్తగా పోలీసులు..
జేసీ ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులను మోహరించారు.
ఇంటి నుంచి ఎవరు బయటకు రాకుండా.. బారికేడ్లను ఏర్పాటు చేశారు. జేసీ ఇంటికి వచ్చిన.. 8 మంది తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెదేపా కార్యకర్తలు జేసీ ఇంటికి రావడంతో.. జేసీ ప్రభాకర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. బయటకు వచ్చిన ఆయన్ను పోలీసులు తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జేసీ నేలపై పడిపోయారు.
పోలీసుల తీరును నిరసిస్తూ..జేసీ తన నివాసంలో నిరసన చేపట్టారు. దీంతో కుర్చీతో సహా జేసీని బలవంతంగా తిరిగి లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించారు. పోలీసుల చర్యలను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రకటనల వల్లే జేసీని అడ్డుకున్నామని పోలీసులు చెప్పారు.