Site icon Prime9

Nara Chandrababu Naidu : ఈరోజే చంద్రబాబు అరెస్ట్.. రేపు 42వ పెళ్లి రోజు

interesting details about nara chandrababu naidu wedding anniversary

interesting details about nara chandrababu naidu wedding anniversary

Nara Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేయగా రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువచ్చారు. తాజాగా ఆయనను సిట్ కార్యాలయానికి తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఆయన అరెస్ట్ కు నిరసనగా తెదేపా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. అలానే చంద్రబాబుని అరెస్ట్ చేసి ఆయనను చూసేందుకు వెళ్లనివ్వకపోవడం పట్ల నారా లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. కాగా ఎన్టీఆర్ కుమార్తె , ఆయన భార్య భువనేశ్వరి కనకదుర్గమ్మను దర్శించుకొని చంద్రబాబుకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు.

ఎవరికైనా మనస్సుకు బాధ కలిగితే కష్టాలు వస్తే తల్లికి చెప్పుకుంటారు..అందుకు తన కష్టాన్ని దుర్గమ్మ తల్లికి చెప్పుకుందామని వచ్చానని అరెస్ట్ అయిన తన భర్తకు మనోధైర్యాన్ని కలిగించాలని అమ్మను కోరానని ఆవేదనతో వెల్లడించారు. ఆమెతో పాటు నందమూరి రామకృష్ణ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు – భువనేశ్వరిలో పెళ్లి రోజు సెప్టెంబర్ 10న అని తెలిసిందే. 1981,సెప్టెంబర్ 10న ఉదయం 8 గంటల 6 నిమిషాలకు చెన్నైలోని మౌంట్ రోడ్డులోని గవర్నమెంట్ లో ఎస్టేట్ కలైవాసర ఆరంగంలో వీరి వివాహం జరిగింది.

Chandrababu Naidu's 3-year-old Grandson Richer by 16 crores - Sentinelassam

అయితే అప్పుడు చంద్రబాబు ఏపీ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెళ్లిరోజుకి ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు చురుకుదనం, విజన్ నచ్చిన ఎన్టీఆర్.. తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. వారి వివాహం జరిగిన రెండేళ్లకు లోకేశ్ జన్మించారు. లోకేశ్ బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే రేపటికి అంటే సెప్టెంబర్ 10 (2023) కు వారి వివాహం జరిగి 42 ఏళ్లు పూర్తి కానున్నాయి. కానీ ఇప్పుడు అనుకోని రీతిలో చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

Exit mobile version
Skip to toolbar