Site icon Prime9

Ibrahimpatnam VTPS Incident : ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం.. 3 మృతి, 5 తీవ్రగాయాలు

ibrahimpatnam vtps incident leads to 3 members death and 5 injured

ibrahimpatnam vtps incident leads to 3 members death and 5 injured

Ibrahimpatnam VTPS Incident : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో గల వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో లిఫ్ట్‌ వైరు తెగి కిందకు పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లో 8 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. లిఫ్ట్ లో చిక్కుకున్న వారిని అతి కష్టం మీద బయటికి తీసి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఓవర్‌ లోడ్‌ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతున్నారు. చనిపోయిన కార్మికుల మృతదేహాలను వీటీపీఎస్‌ బోర్డు ఆసుపత్రికి తరలించారు.. మృతులు జార్ఖండ్ కు చెందిన కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. దీనిపై కొండ‌ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఎన్టీటీపీఎస్ లో ప్రమాదం జరిగిందని పలువురు కార్మిక సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రత పరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. తక్షణమే వీటిపిఎస్, పవర్ మేక్, కంపెనీల అధికారులు బోర్డు హాస్పటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు బోర్డు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Exit mobile version