Site icon Prime9

Kakinada Parry Sugar Industry: వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి.. ఆరుగురికి గాయాలు

Andhra Pradesh: కాకినాడ జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకొంది. మరణించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారుగా కార్మికులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

గత నెలలో విశాఖలోని ఎల్ జీ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటన పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అంతకుముందు విశాఖ పాలిమర్స్ ప్యాక్టరీలో జరిగిన లీకేజీ తరువాత రాష్ట్రంలో ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అన్ని ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించింది.

 

 

Exit mobile version