Site icon Prime9

Huge Blast : కుప్పంలో కలకలం.. భారీ పేలుడుతో భయాందోళనలో ప్రజలు.. ఇద్దరి పరిస్థితి విషమం

volunteer kills old women in Visakhapatnam district

volunteer kills old women in Visakhapatnam district

Huge Blast : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కుప్పం పట్టణంలో గల కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు సహా జిలెటిన్ స్టిక్స్ పేలినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మురుగేష్, ధనలక్ష్మీ దంపతులు.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

కాగా ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు ఆ దంపతుల ఇంటి గుమ్మం వద్ద… నాటు బాంబు, జిలెటిన్‌స్టిక్స్‌ పెట్టి పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం కాగా.. దంపతుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతులను టార్గెట్‌ చేసిన దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారా ? లేక ఇంకేదైనా కారణముందా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో కుప్పంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Exit mobile version