Site icon Prime9

House Issue : నరసరావుపేటలో దారుణ ఘటన.. ఇంటిని అద్దెకు ఇస్తే.. కబ్జా చేసి చంపుతామంటూ బెదిరింపు

house issue in narasaraopeta an old woman requesting for justice

house issue in narasaraopeta an old woman requesting for justice

House Issue : ఏపీలోని నరసరావుపేటలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఇంటిని ఓ మహిళకు అద్దెకు ఇస్తే..  అందులో వ్యభిచారం నిర్వహిస్తోందని.. మట్కావ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటిని కబ్జా చేశారని.. అతను రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో పోలీసులు చర్యకు వెనుకాడుతున్నారని.. ఖాళీ చేయమంటే చంపుతామని బెదిరిస్తున్నారని..’ అంటూ న్యాయం కోసం ఓ వృద్ధురాలు అధికారుల చుట్టూ తిరుగుతోంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని రామిరెడ్డిపేట 21వ వార్డుకు చెందిన తిరుమలశెట్టి సుబ్బాయమ్మ వృద్ధాప్యంతో పెద్ద కుమారుడి వద్ద ఆశ్రయం పొందుతోంది. ఆస్తుల పంపకంలో భాగంగా తనకు దక్కిన పెంకుటింటిని అద్దెకిచ్చింది. ఇందులో చాలాకాలంగా ఉంటున్న ఓ మహిళ గుట్కా వ్యాపారితో అక్రమ సంబంధం నెరపుతోంది. మట్కా నిర్వహిస్తూ.. జల్సాలకు అలవాటుపడిన అతను రాజకీయ నేతల వద్ద పలుకుబడి పెంచుకుని అసాంఘిక వ్యవహారాలు నిర్వహిస్తున్నాడు.

ఏళ్ల తరబడి అద్దె చెల్లించక పోవడంతో వృద్ధురాలు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతోంది. ఇల్లు ఖాళీ చేయమని అడిగితే బెదిరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె పోలీసులను ఆశ్రయించింది.  స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ఎస్పి రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమెను వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు పంపించారు. అయితే అక్కడి పోలీసులు ఆమె కేసును సివిల్ వ్యవహారమని పట్టించుకోలేదు. కోర్టుకు వెళ్లాల్సిందిగా తెలిపారు.  రెవెన్యూ డివిజన్‌ కార్యాలయ అధికారులను అడిగితే పోలీసుల వద్ద పరిష్కారం చేసుకోమంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలు పోనీ ఆమె తీవ్ర ఆవేదనతో ఉన్నతాధికారులు కరుణించి.. ఇంటిని ఖాళీ చేయించి తనకు అప్పగించాలని ఆమె కోరుతోంది.

Exit mobile version