Site icon Prime9

Vallabhaneni Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం..

gannavaram mla vallabhaneni vamsi car got accident

gannavaram mla vallabhaneni vamsi car got accident

Vallabhaneni Vamsi : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాగా వంశీ కాన్వాయ్ లో వెనక నుంచి ఓ వాహనాన్ని.. మరో వాహనం ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో కాన్వాయ్ లోని ఒక వాహనం స్వల్పంగా.. మరో వాహనానికి కాస్తా ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు సమాచారం అందుతుంది.

2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీకి మద్దతు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేయనున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు నిన్న వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాట్లు తెలిపారు.

Exit mobile version