Site icon Prime9

Ex Minister Somireddy: పౌర సరఫరాల సంస్ధలో కోట్ల రూపాయల కుంభకోణం.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Find out who is involved in the multi-crore scam in the Civil Supplies Corporation

Nellore: నెల్లూరు పౌరసరఫరాల సంస్ధలో చోటుచేసుకొన్న కోట్లాది రూపాయల బియ్యం కుంభకోణం కేసులో పాత్ర ఎవరిదని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇందులో పాత్రదారులు అధికారులా లేదా మంత్రుల హస్తమా చెప్పాలని లేదంటే సీఎం జగన్ కు కుంభకోణంలో భాగమున్నట్లు అనుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

మొదట 30 కోట్ల కుంభకోణమని అన్నారు కానీ, అది ఇప్పుడు 900 కోట్ల కోట్లకు దాటిన్నట్లు తెలుస్తోందన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్రతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బియ్యం మాయమైతే జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి ఏం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ లా మారిన పౌర సరఫరాల సంస్థ కుంభకోణం నెల్లూరుకే పరిమితమైందా లేదా జగనన్న రాజ్యంలో రాష్ట్రమంతా విస్తరించిందా అన్న అనుమానాన్ని కూడా సోమిరెడ్డి వ్యక్తం చేశారు.

ధాన్యం మాయం పై సీబీఐ విచారణ జరపాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. సీఐడీ ఏర్పాటు చేస్తే అది ప్రభుత్వానికి ఓ ప్రైవేటు ఏజెన్సీ కాబట్టి న్యాయం జరగదన్నారు. సీబీఐ విచారణ జరిపి, తప్పు చేసిన వాళ్లని జైలుకు పంపాలన్నారు. ప్రభుత్వం తన నిజాయతీని చాటుకోవాలని, లేదంటే తెలుగుదేశం పార్టీనే రంగంలోకి దిగి తాడోపేడో తేల్చుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం నగదు చెల్లింపుల్లో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ధాన్యం ఇచ్చిన 6 నెలలకు కూడా నగదు అందకపోతే రైతులు ఎలా బతకాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉలవపాడు మండలంలోని ఓ గ్రామ రైతులకు రూ. 2కోట్ల చెల్లింపుల కొరకు రైతులు దర్నాకు దిగడాన్ని ఏమనికోవాలో చెప్పాలన్నారు. ఆర్బీకే లో పేర్కొన్న మేర ధాన్యం తరలింపులో లారీ దగ్గర నుండి కూలీలు వరకు ప్రభుత్వమే అన్ని చూసుకుంటుందని,  మీ అకౌంట్లలో డబ్బులు మాత్రం ఇట్టే పడిపోతున్నాయని జగన్ గొప్పలకు, చేతలకు చాలా తేడా వుందన్నారు.

ఇది కూడా చదవండి: AP High Court: రైతుల పాదయాత్రకు హైకోర్టు పచ్చ జెండా

Exit mobile version