Amaravati: ఏపీ రాజధానిగా అమరావతినే కోరుకుంటూ రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర 26రోజుకు చేరుకొనింది. అమరావతి నుండి అరసవళ్లి వరకు రైతులు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ఈ రోజు కాళ్ల మండపం, పెద అమిరం నుండి వీరవాసరం వరకు 15కి.మీ పాదయాత్ర సాగనుంది.
వర్షం కూడా లెక్క చేయకుండా రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వైకాపా మినహాయించి అన్ని రాజకీయ పక్షాలు, అనుబంధ సంఘాల నుండి వస్తున్న ఆదరణతో రైతులు ఉత్సాహంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రతి పల్లెలో రైతులకు జనం జేజేలు పలుకుతున్నారు. వారిపై పూలు చల్లుతూ పాదయాత్ర ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు.
మరో వైపు అధికార పార్టీ వైకాపా నేతలు రాజధాని రైతులను ఉత్తరాంద్ర ద్రోహులుగా చిత్రీకరిస్తూ వారిని అడ్డుకోవాలంటూ పదే పదే రెచ్చగొడుతున్నారు. మంత్రులు అసభ్యంగా మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకొనేలా ప్రవర్తిస్తున్నారు. వైకాపా కూడా మూడు రాజధానులు కావాలంటూ పాదయాత్రను తలపెట్టి దిశగా అడుగులు వేస్తున్నారు.
మొత్తం మీద అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు తగినంత ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేకపోవడంతో అభివృద్ధిని నీరుగారుస్తున్నారు. ఎక్కడ రాజధాని, ఏ ప్రాంతంలో అభివృద్ది సాగుతుందో అర్ధం కాక పలు పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. సంక్షేమ పధకాల కోసం తెస్తున్న అప్పులు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితికి గుది బండగా మారుతున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం చలనం శూన్యంగా ఉంది.
ఇది కూడా చదవండి: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోండి…తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి