Site icon Prime9

YSRCP: వైఎస్ జగన్ ఇలాకలో వర్గపోరు.. తారస్థాయికి చేరిన విభేదాలు

Factionalism among the Kadapa leaders of the YSRCP: కడప జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రమవుతోంది. ఆ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఈ వైరం కాస్తా చాపకింద నీరులా కొనసాగుతోంది. గ్రూపుల గోల ఎక్కువవుతోంది. ఎక్కడికక్కడే విభేదాలు బయటపడుతున్నాయి. నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సాక్షాత్తు మాజీ సీఎం, వైసీపీ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో వైసీపీ శ్రేణుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్ మధ్య వివాదం ముదిరింది. ఇరువర్గాల మధ్య పరస్పర రాళ్లదాడులు వేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. రెండు కుటుంబాల పాఠశాల విద్యార్థుల గొడవులు, పాతకక్షలు ఇరువర్గాలకు వివాదానికి కారణమైంది.

ఆందోళనలో కేడర్..
పులివెందులలో ఫైర్ స్టేషన్ వద్ద ఇరువర్గాలు ఎదురెదురుగా రావడంతో పరస్పర రాళ్లదాడులు చేసుకున్నాయి. పోలీసులు రంగప్రవేశంతో గొడవ ప్రస్తుతానికి సద్దుమణిగింది. గాయపడిన వారిని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వివాదం ఇప్పుడు పులివెందులలో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందోనని వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. వైసీపీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ప్రతిచోటా రెండువర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తారస్థాయిలో వర్గపోరు..
ఇటీవల పులివెందులలో బయటపడిన విభేదాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వైసీపీ కీలక నేతలు పాల్గొనే కార్యక్రమానికి కూడా రెండు వర్గాలు అంటీముట్టన్నట్లుగా దూరంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్ మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు తారస్థాయిలో కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల వివాదంతో స్థానిక వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా వైసీపీలో ఇప్పుడున్న పరిస్థితి మరింత ముదిరితే.. దీని ప్రభావం ఎంతవరకు వెళ్తుందోనని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వర్గ పోరుపై పార్టీ హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టాలని నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.

Exit mobile version
Skip to toolbar