Prime9

Ex Minister Narayana : తెదేపా మాజీ మంత్రి నారాయణపై అతని తమ్ముడి భార్య తీవ్ర ఆరోపణలు.. చిత్రహింసలకు గురిచేసేవారని !

Ex Minister Narayana : తెదేపా మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారని ఆమె అన్నారు. ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని చెప్పారు. మోసపోయిన పిట్టను తానేనని వ్యాఖ్యానించారు. నారాయణ తనను చిత్రహింసలకు గురిచేసేవారని ఆరోపించారు. ఇంట్లో భార్య ఉండగానే, తాను అన్నం తీసుకురాలేదని ఓ సారి తనను కొట్టారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియో రూపంలోనే తన ఆవేదన వ్యక్తం చేశారు. నవ్వుతూ ఆమె తన వ్యాఖ్యలు ప్రారంభించి ఏడుస్తూ ముగించారు.

నారాయణ తమ్ముడి పేరు మణి. ప్రస్తుతం ప్రియ దంపతులు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ప్రియ చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఈ వివాదం తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో​ వైరల్‌గా మారింది.

 

YouTube video player

Exit mobile version
Skip to toolbar