Site icon Prime9

Crime News : ఏలూరులో సంచలనం.. ఓ మహిళ.. కన్నకూతుర్లను రెండో భర్తతో ఏం చేయించిందో తెలిస్తే ఛీ అనడం ఖాయం..

Crime News about mother forcing daughters with second husband

Crime News about mother forcing daughters with second husband

Crime News : సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు తెలుస్తున్నప్పుడు అసలు ఇలాంటి మనుషులు ఉన్నారా..? ఇలాంటి వాళ్ళని అసలు ఏం అనాలి.. ఏం చేయాలి.. అని అనిపిస్తుంటుంది. అలాంటి ఓ అమానుష ఘటన ఏపీ లోని ఏలూరులో చోటు చేసుకుంది. ఆ షాకింగ్ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఏలూరులో ఓ తల్లి తన పిల్లల పట్ల అత్యంత అసహ్యంగా అనిపించే చర్యను జరిపింది. అత్యంత కీచకంగా, నీచంగా ప్రవర్తించిన ఈ ఘటన జిల్లాలోని పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉండే ఓ మహిళ కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు పుట్టిన తర్వాత 2007 లో ఇంకా పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి అనారోగ్యంతో ఆమె భర్త మృతి చెందాడు.

ఆ తర్వాత మేనత్త కొడుకును రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే తన రెండో భర్త.. పిల్లల కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనకు పిల్లలు కావాలని.. లేదంటే రెండో పెళ్లి చేసుకుంటానంటూ బెదిరించేవాడు. దాంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో అత్యంత దారుణానికి.. తల్లి అనే పిలుపుకు కూడా మచ్చ తెచ్చే ఆలోచనకు తెరతీసింది. తన ఆడపిల్లలు ఇద్దరు యుక్త వయసుకు వచ్చారని.. తన కూతుర్లతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తను ఒప్పించింది. ఇలా ఇద్దరు కూతుర్లని అతనికి అప్పగించింది. 2017లో పెద్ద కూతురు తల్లి రెండో భర్తతో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

తర్వాత మగ పిల్లాడు కావాలనుకోవడంతో తన రెండో కూతురిని కూడా.. భర్తకు అప్పగించింది. ( Crime News ) ఏడాది క్రితం రెండో కూతురికి మగపిల్లాడు పుట్టాడు. పుట్టిన కాసేపటికే చనిపోయాడు. దీంతో ఆ మృతదేహాన్ని వారు ఎలాంటి కర్మకాండలు లేకుండా కాలువలో పడేశారు. ఈ క్రమంలో ఇటీవల ఆ తల్లికి రెండో భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో కూతుర్లను ఊర్లోనే వదిలేసి విశాఖ పట్నంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సమయంలో చిన్న కుమార్తె తనకు పరిచయం ఉన్న యువకుడితో ఇంట్లో జరుగుతున్నదంతా చెప్పుకుంది. దీంతో ఆ యువకుడు ఆ చిన్నారుల మేనమామకు విషయాన్ని తెలిపాడు. అప్పటివరకు విషయం తెలియని బంధువులంతా షాక్ అయ్యారు. అందరూ కలిసి ఏలూరు కు వచ్చారు. బాధితులు ఇద్దరినీ తీసుకుని దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయించారు. దిశ సీఐ ఇంద్ర కుమార్ వీరి ఫిర్యాదును తీసుకుని… నిందితుల మీద పోక్సో కేసు పెట్టారు.

కాగా ఈ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మహిళను, రెండో భర్త సతీష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులకు అవాక్కయ్యే విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు కూతుర్లు మళ్లీ గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరికీ మొదటిసారి కన్నతల్లి యూట్యూబ్లో చూసి డెలివరీలు చేసిందని సమాచారం. అంతేకాదు పెద్ద కూతురుతో పుట్టిన కూతురికి.. తనకు, తన భార్యకు పుట్టిన కూతురిగా సతీష్ బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వాస్తవాలు వెలుగు చూడడంతో తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారుటితండ్రి మీద పోక్సో కేసు నమోదు చేశారు.

Exit mobile version