Site icon Prime9

Adani Gangavaram Port : అదానీ గంగవరం పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట

contract labours protest at adani gangavaram port

contract labours protest at adani gangavaram port

Adani Gangavaram Port : అదానీ గంగవరం పోర్టులో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వరంలో ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కార్మిక సంఘాల ఆందోళన నేపథ్యంలో గంగవరం పోర్టు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోర్టు గేటు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్లకంచెను దాటుకుని వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలయ్యాయి.

పోర్టు సమీపంలోని రోడ్డుపై కార్మికులు బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇదిలా ఉంటే కార్మికుల డిమాండ్లకు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కార్మికుల ఆందోళనలకు మాజీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించాయి. గత 45 రోజులుగా గంగవరం పోర్టులో పనిచేసే కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ అక్కడికి చేరుకొని కార్మికులతో చర్చిస్తున్నారు.

ఇదిలా ఉంటే గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చిన కార్మికులకు పలు పార్టీలు మద్దతు పలికాయి. వామపక్షాలు, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీలు మద్దతు పలికాయి. కార్మికులతో కలిసి పోర్టులోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. కార్మికులతో పాటు పోర్టు నిర్వాసితులు కూడ ఆందోళనలో పాల్గొన్నారు. పోర్టు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు ఆందోళనకారులు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు.

పక్కనే ఉన్న ప్రభుత్వ పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు రూ. 36 వేల వేతనం ఇస్తున్నారన్నారు. కానీ అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు కేవలం రూ. 15 వేలను మాత్రమే చెల్లిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

 

Exit mobile version