Site icon Prime9

10th Student Murder : బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి సజీవ దహనం కేసులో బట్టబయలైన షాకింగ్ విషయాలు..

Vijayawada murder

Vijayawada murder

10th Student Murder : బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్ధిని పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించి పోలీసులు షాక్ అయ్యే కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం.. జిల్లాలోని చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధి ఉప్పాలవారిపాలెం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఉప్పాల అమర్నాథ్‌.. గ్రామ సమీపంలోని రాజోలు జిల్లా పరిషత్‌ ఉనుత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటి లాగానే ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న కుర్రాడిని నిన్న ఉదయం అడ్డగించిన నలుగురు యువకులు పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చి మృతి చెందాడు.

ఆ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. అసలు బాలుడ్ని అంత కిరాతకంగా ఎందుకు హత్య చేశారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమర్నాథ్ అక్క చెరుకుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఆమెను రాజోలు గ్రామానికి చెందిన యువకుడు పాము వెంకటేశ్వరరెడ్డి నిత్యం టీజ్‌ చేసేవాడు. దీనిపై అమర్నాథ్‌ రెండు నెలల క్రితమే అతనిని హెచ్చరించాడు. ఇంకోసారి అలా చేస్తే బాగుండదని హెచ్చరించాడు. దీంతో బాలుడిపై కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి స్నేహితులతో కలిసి రెండుసార్లు బాలుడిపై దాడిచేశాడు. తనపై దాడి విషయాన్ని అమర్నాథ్.. వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు.

దీంతో అమర్నాథ్‌పై మరింత కక్ష పెంచుకున్న నిందితుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నిన్న సైకిలుపై ట్యూషన్ నుంచి వస్తున్న బాలుడిని అడ్డగించి కొట్టాడు. ఆ తర్వాత కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి తగలబెట్టాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Boy burnt alive in Bapatla district

అయితే నేడు అమర్నాథ్ మృతదేహానికి అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రజాసంఘాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా రానుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కాగా వైకాపా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు ఈ సందర్భంగా నిరసన సెగ తగిలింది. హత్య చేసిన నలుగురికి ఇక్కడే శిక్ష వేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. అయితే, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం, అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మోపిదేవి. కానీ, నిందితులకు ఇక్కడే శిక్ష పడాలంటూ ఎంపీని మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ మోపిదేవి వెంకట రమణ.. బాలుడు అమర్నాథ్‌ హత్య దురదృష్టకరం అన్నారు.. రాజకీయాలు, కులాలకు అతీతంగా విచారణ జరుగుతుందన్న ఆయన.. 24 గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు.. మృతుని కుటుంబానికి ఆర్థిక నష్ట పరిహారం, ఇంటి స్థలం, ఇంటినీ ప్రభుత్వ తరపున ఇస్తామని చెప్పామని.. నా తరపున లక్ష ఆర్ధిక సాయం చేస్తున్నానని వెల్లడించారు.
Exit mobile version
Skip to toolbar