Site icon Prime9

CM Ys Jagan : ఐదవ సారి వాహన మిత్ర నిధులను విడుదల చేసిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై ఫైర్ !

CM Ys Jagan release vahana mitra scheme funds at vijayawada

CM Ys Jagan release vahana mitra scheme funds at vijayawada

CM Ys Jagan : త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్‌ ఈరోజు విడుదల చేశారు. ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ నడుపుతూ జీవినం సాగించే వారి కోసం ఆర్థిక సాయం అందించేందుకు జగన్ సర్కార్ 2019లో వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు రూ. 10 వేల చొప్పున లబ్ధిదారులకు అందిచింది. ఈరోజు విడుదల చేసిన రూ. 10 వేలతో కలిపి మొత్తం రూ. 50 వేలు సాయం అందించినట్లు అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..  వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నామని అన్నారు.

ఎంతో మంది ప్రయాణికులకు సేవలు అందించే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వైసీపీ సర్కారు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే పథకాలు అన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా వాలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశామన్నారు. ఆర్బీకేలతో రైతులకు అండగా నిలిచామని.. పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశానంటూ చెప్పుకొచ్చారు. మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం తమదంటూ వివరించారు.

 

నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో స్కామ్‌, స్కిల్‌ స్కామ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని మండిపడ్డారు. ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారు ఉన్నారని విమర్శించారు. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. గత పాలకులకు మనసు లేదు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి. ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి అని సీఎం జగన్‌ (CM Ys Jagan) పేర్కొన్నారు.

Exit mobile version