CM Ys Jagan : పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. స్థానిక స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ బడుల్లో చదువుతున్న 43,10,165 మంది విద్యార్దులకు ఈ కిట్ అందజేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం 1,042.53 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రతి విద్యార్థిపై దాదాపు రూ.2,400లు వెచ్చిస్తున్నట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఈ కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తో సహా 4 దశల్లో నాణ్యత పరీక్షలు చేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)ని ఈ విద్యా కానుక కిట్‌లో ఉంచారు.