Site icon Prime9

CM Ys Jagan : కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్..

cm ys jagan in raithu bharosa programme at kurnool district

cm ys jagan in raithu bharosa programme at kurnool district

CM Ys Jagan : రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదని సీఎం జగన్ (CM Ys Jagan) అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహిస్తున్న రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. అదే విధంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. ఐదో ఏడాది.. తొలి విడుత నిధుల్ని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది కానీ..  మేం మొదటి నుంచి రైతులకు అండగా ఉంటూ వస్తున్నాం. ప్రతీ రైతన్నకు రూ.61,500 సాయం (ఈరోజు జమ చేసే డబ్బులతో కలిపి ) అందించాం. గత నాలుగేళ్లుగా 22.70 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు.. రూ.1,965 కోట్లు నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేశాం అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల వేల మేనిఫెస్టులో చెప్పిన దాని కంటే మిన్నగా.. 12500 ఇస్తామని చెప్పాం కానీ.. అధికారంలోకి వచ్చాక 13500 ఇస్తున్నామన్నారు. నాలుగేళ్ల ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. కానీ ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రతి రైతు 54వేల రూపాయలు అందుకున్నారు. ఈ దఫా ఇచ్చే ఈ 7500 కలుపుకుంటే ప్రతి రైతు చేతిలో 61500 నేరుగా జమ చేసినట్టు అవుతుంది. రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సాయాన్ని ఈ దఫా 52లక్షల3 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం అని వివరించారు.

 

అలానే మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రూ.12,500కి బదులు.. రూ. 13,500 రైతు భరోసా అందిస్తున్నాం. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేశాం. ప్రతీ ఏడాది రూ. 3,923 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తున్నాం. ఏ సీజన్‌లో అయిన పంట నష్ట జరిగితే.. అదే సీజన్‌లో నష్ట పరిహారం అందిస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. విత్తనం నుంచి పంట కొనుగోలుదాకా రైతన్నలకు అండగా ఉన్నాం. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీ ఈ బిడ్డ పరిపాలన మొదలయ్యాక.. మంచి వానలు ఉన్నాయి. కరువుల్లేవ్‌.. వలసలు కూడా తగ్గిపోయాయి. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం లేదని సీఎం జగన్‌ చెప్పారు.  ఆర్‌బీకేల ద్వారా 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామని.. ఈ నాలుగేళ్లలో ధాన్య సేకరణపై రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ వ్యయం రూ. 77 వేల కోట్లకు చేరుతుందని అన్నారు.

సుమారు వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే జరుగుతోంది. సమగ్ర భూసర్వేతో భూవివాదాలను పరిష్కరిస్తున్నామన్నారు. చుక్కల భూములపై సర్వ హక్కులూ రైతులకే ఇచ్చిన ప్రభుత్వం మనది. అక్వా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం మనదే. అక్వా రైతులకు రూ. 2,967 కోట్లు సబ్సిడీ అందించాం. రైతులకు పగటి పూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. రూ.1,700 కోట్ల తో ఫీడర్లను బలపరుస్తున్నాం. రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులను మీ గ్రామానికే తీసుకొచ్చే అడుగుపడుతోందని సీఎం జగన్‌ ప్రకటించారు.

 

Exit mobile version