Site icon Prime9

CM Jagan : శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం – సీఎం వైఎస్ జగన్

CM Jagan speech at moulana abul kalaam azad birth anniversary in vijayawada

CM Jagan speech at moulana abul kalaam azad birth anniversary in vijayawada

CM Jagan : భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆ­జా­ద్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్య­టించారు. స్థానిక ఇంది­రా­గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్‌ రిజర్వేషన్‌లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు.

నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని.. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్‌ అన్నారు. అలానే మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసిందని.. కానీ ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను గౌరవిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు.. మనందరిది అని స్పష్టం చేశారు.

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించామని.. సాధికారిత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించామన్నారు. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది అని సీఎం  (CM Jagan) పేర్కొన్నారు.

 

వైకాపా ప్రభుత్వం ప్రతి అడుగులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుని వెళ్తుందన్నారు. చంద్రబాబు హయాంలో మైనార్టీల సంక్షేమానికి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మన ప్రభుత్వంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశాం. విజయవాడ నుంచి హజ్‌యాత్రకు వెళ్తే అవకాశం కల్పించాం. అదనపు భారం పడకుండా రూ.14 కోట్లు మన ప్రభుత్వం చెల్లించింది. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనం అందిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ (CM Jagan) తెలిపారు.

Exit mobile version