Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశ పెట్టారు. కృష్ణా జిల్లా పెడనలో ఈ కార్యక్రం జరిగింది. పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను అందరిని ఆకట్టుకుంది. సీఎం జగన్ కూడా ఈ ఎగ్జిబిషన్‌ను చూసి తిలకించారు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళాకారుల ప్రదర్శనలను కూడా జగన్ వీక్షించారు. చేనేత కళాకారుల ప్రదర్శనను చుసిన సీఎం జగన్ స్వయంగా మగ్గాన్ని కూడా నేశారు. ఆ తరువాత బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది లబ్ధిదారుల ఉన్నారు. నేతన్నలకు 4వ విడతగా రూ.193.31 కోట్లను జమ చేసారు.
సొంత మగ్గం కలిగి ఉండి ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి ఏడాదికి రూ.24,000 చొప్పున ఆర్ధిక సాయాన్ని జమ చేస్తున్నారు జగన్. ఇప్పటివరకూ నేరుగా నేతన్నలకు ఈ పథకం ద్వారా అందించిన మొత్తం రూ.776.13 కోట్లు కేటాయించారు. నేతన్నల కష్టాలను నేను పాదయాత్రలో గమనించానని, అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చామని ఈ కార్యక్రంలో జగన్ వెల్లడించారు. మగ్గం నేసే నేతన్నలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మాట కూడా ఇచ్చారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా లబ్ది దారుల ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పారు. లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిస్తుందని గుర్తించారు. ఇప్పటికి రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్లు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతలా సాయం చెయ్యలేదని జగన్ గుర్తు చేసారు. చంద్రబాబు ప్రభుత్వ కేవలం ఒకే వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని, రాష్ట్రంలో అన్ని వర్గాలకు మా ప్రభుత్వం అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వం తమదే అని, కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని, మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించామని గుర్తు చేసారు.