Site icon Prime9

CM Jagan: విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదే.. సీఎం జగన్

cm-jagan-teachers-day-2022

Vijayawada: మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. డాక్టర్‌ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.

విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువుల దేనని, తనకు విద్య నేర్పిన గురువులను సీఎం జగన్‌ గుర్తు చేశారు. నాకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటానని సీఎం అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం అన్నారు. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌. సాన పట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం అన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం జగన్‌ ప్రదానం చేసి సత్కరించారు.

Exit mobile version