Site icon Prime9

Chandrababu: వివేకా హత్యపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu: వైఎస్ వివేకా హత్యపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయడు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసి.. ఆ విషయాన్ని దాచడానికి అనేక కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. ఏలూరులో నిర్వహించిన తెదేపా నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ముమ్మాటికీ అంతఃపుర హత్యే: చంద్రబాబు (Chandrababu)

వైఎస్ వివేకా హత్యపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయడు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసి.. ఆ విషయాన్ని దాచడానికి అనేక కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయని అన్నారు. హత్య జరగడానికి ముందు.. ఎంపీ అవినాష్‌ ఇంట్లో కుట్ర జరిగిందని దర్యాప్తులో ఈ విషయం బయటకు వచ్చిందని తెలిపారు. రాజకీయాలకు అడ్డుగా ఉన్నాడనే.. వివేకాను హత్య చేసినట్లు తెలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఇంత జరిగినా ఎంపీ అవినాష్‌ ని వైసీపీ నేతలు వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య ఎలా జరిగిందో.. కచ్చితంగా శవపరీక్ష చేయాల్సిందేనని ఆయన కుమార్తె సునీత డిమాండ్ చేసింది. ఈ హత్యను తెదేపా నేతలపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యతో అవినాష్‌కు సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. వివేకా హత్య హత్య తర్వాత లోటస్‌ పాండ్‌కు ఫోన్‌ వెళ్లింది. ఇవన్నీ చూస్తుంటే.. వివేకాది వైసీపీ హత్యేనని అన్నారు.

వైసీపీ పథకాలు విఫలం..

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు పూర్తిగా విఫలం అయ్యాయని రాష్ట్రం పాలన గాడి తప్పిందని చంద్రబాబు ఆరోపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెదేపా చేపడుతున్న కార్యక్రమాలకు ఎన్ని ఆటంకాలు కలిగించిన ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అధికారంలోకి వస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

కావాలనే గన్నవరం కార్యాలయంపై దాడి..

గన్నవరం కార్యాలయంపై జరిగిన దాడి గురించి చంద్రబాబు స్పందించారు. ప్రణాళిక ప్రకారమే.. తెదేపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ధ్వంసమైన తెదేపా కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. వైసీపీకి వత్తాసు పలుకుతున్న పోలీసులు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. వారి కనుసన్నల్లోనే దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. బెదిరిస్తే పారిపోమని.. పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల కంటే.. ఘోరంగా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Exit mobile version