Sullurpet: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) 103వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత కామ్రెడ్ కె. శ్రీనివాసుల చేతులమీదుగా ఏఐటియుసి పతాకవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు కార్మిక సంఘ నేతలు ప్రసంగించారు.
స్వతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని ఏకతాటి పై నడిపించిన ఘనత ఏఐటియుసిది అన్నారు. కార్మికుల హక్కుల కోసం నిర్విరామంగా పోరాటం చేస్తున్నామన్నారు. కార్మికులను సంఘటితం చేస్తూ, వారికి జరుగుతున్న అన్యాయాలు ఎత్తి చూపుతూ, పోరాటపటిమని చూపిన ఘన చరిత్ర ఏఐటియుసికి ఉందన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధం కావలన్నారు. గుత్తేదారులకు కొమ్ముకాస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని, మద్ధతిస్తున్న వైకాపా ప్రభుత్వాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులను ఏకతాటిపైకి తీసుకొస్తూ సార్వత్రిక సమ్మెలు నడిపించడంలో ఏఐటియుసి చేపట్టిన విజయాల్లో ఓ కీలక ఘట్టంగా చెప్పుకొచ్చారు.
కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు, సభ్యులు కుమార్ అహ్మద్ బాషా, రమేష్ బి రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం వినోద్, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి తేరే సూర్య, మహిళా సంఘం నాయకురాలు లక్ష్మమ్మ సిపిఐ నేతలు సుధాకర రెడ్డి, ప్రభుదాస్ లతోపాటు ఆటో, హమాలీ, స్ట్రీట్ వెండార్స్ , భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Former minister Narayana: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు