Site icon Prime9

Gannavaram Airport : గన్నవరం విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్.. చివరికి ఏమైందంటే ?

bomb threat to gannavaram airport at andhra pradesh

bomb threat to gannavaram airport at andhra pradesh

Gannavaram Airport : ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. గన్నవరం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ప్రయాణికులను బయటకు పంపించి విమానాశ్రయం మొత్తం తనిఖీలు చేపట్టినా ఎక్కడా బాంబులు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ కాల్స్ ఆకతాయిల పనిగా తేల్చిన అధికారులు వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

 

YouTube video player

Exit mobile version
Skip to toolbar