Site icon Prime9

TTD: టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్‌ నాయుడు

Bollineni Rajagopal Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకత్తల మండలి ఛైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్‌ నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో శ్యామలరావు ఆయనతో ప్రమాణం చేయించారు. టీటీడీ సంప్రదాయాల ప్రకారం.. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు.

ఈ సందర్బంగా ఆయనతో పాటు బోర్డు సభ్యులైన జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటేశ్వరరావు, పనబాక లక్ష్మి, ఎంఎస్‌ రాజు, నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సాంబశివరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, వన్నపనేని సదాశివరావు, ఆర్‌ఎన్ దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌ఎల్ దత్‌, శాంతరామ్, రామ్ముర్తి, తమ్మిశెట్టి జానకిదేవి, బి.మహేందర్‌రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా వంటి తదితరులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

Exit mobile version