Site icon Prime9

Balineni Srinivasa reddy : వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా అనంతరం.. మొదటిసారి సీఎం జగన్ తో కీలక భేటీ కానున్న బాలినేని

balineni srinivasa reddy meeting with ap cm ys jagan

balineni srinivasa reddy meeting with ap cm ys jagan

Balineni Srinivasa Reddy : వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. అయితే క్రమంలో తాజాగా ఈరోజు మధ్యాహ్నం 2 గణలకు సీఎం జగన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ భేటీ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రకాశం జిల్లాలో వైకాపా పరిస్థితి గురించి.. బాలినేని వ్యవహరిస్తున్న తీరు గురించి సొంత పార్టీ నేతల నుంచి సీఎం జగన్ కి కంప్లైంట్ లు వెళ్లాయని కూడా సమాచారం అందుతుంది. దీంతో ఈ భేటీ తర్వాత జరగబోయే వ్యవహారం హాట్ టాపిక్ గా మారే సూచనలు ఉన్నాయి.

ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బంధువనే సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో.. బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. ఇటీవల వైఎస్ జగన్ మార్కాపురం పర్యటన సందర్భంలో కూడా ప్రోటోకాల్ రగడ జరిగింది.

సీఎం వచ్చే హెలిప్యాడ్ దగ్గరకు అనుమతించకపోవడంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లడంతో.. ఆయన తిరిగివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Exit mobile version