Site icon Prime9

Attack On Young Girl : దొంగతనం నెపంతో.. రెండు రోజులు ఇంట్లో నిర్బంధించి గిరిజన యువతిపై దాడి

attack on young girl at krishna district and news got viral

attack on young girl at krishna district and news got viral

Attack On Young Girl : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశారనే అనుమానంతో.. గిరిజన యువతిపై పైశాచికంగా దాడి చేసి ఆ తర్వాత పోలీసుల చేత కొట్టించడం.. రెండు రోజులుగా బందీలుగా చేసి ఇబ్బంది పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామంలో ఇటీవల మత్తి రాజా బాబు అనే వ్యక్తి ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. దీంతో తమ ఇంట్లో పని చేయాలని అదే గ్రామానికి చెందిన దుర్గ అనే ఎస్టీ యానాది కులానికి చెందిన యువతిని పనికి పిలిచారు. ఆమె వయస్సు 18 సంవత్సరాలు.  అయితే ఊహించని రీతిలో వారి ఇంట్లో చోరీ జరిగిందని.. బంగారు ఆభరణాలు కనిపించడం లేదని.. ఆ దొంగతనం చేసిందనే అభియోగాన్ని అ యువతిపై మోపారు. అంతటితో ఆగకుండా..ఆ యువతిని విచక్షణా రహితంగా కొట్టారు.

దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రాదేయపడ్డ వినలేదని.. బలవంతంగా నేరాన్ని ఒప్పుకోవాలంటూ మరోసారి పోలీసులతో కొట్టించారని వాపోయింది. ఈ క్రమంలో ప్రశ్నించిన బాధితురాలి తల్లిని సైతం కొట్టారని బాధిత యువతి కన్నీటి పర్యంతమయ్యారు. వారిని రెండు రోజులు బందీలుగా చేసి ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. చేయని నేరాన్ని ఒప్పుకోవాలని మాపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షులు గోవర్థన్, బాధితులను స్థానిక ఆస్పత్రిలో తరలించి వైద్య సహాయం అందించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

Exit mobile version