Site icon Prime9

Janasena : వైసీపీ నేతలసై జనసైనికుల దాడి

JANASENA

JANASENA

 Janasena: విశాఖ గర్జన ముగించుకొని మంత్రులు, వైసీపీ నేతలు విశాఖ నుంచి తిరుగుపయనమవుతున్న టైంలో ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న జనసైనికులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు రోజా, జోగి రమేశ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. మంత్రులు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. దీనిపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రం ముగిసిన వెంటనే జనసేన హడావుడి మొదలైంది. ఎయిర్‌పోర్టుకు పవన్ చేరుకుంటారని తెలుసుకున్న జనసైనికులు భారీగా చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు మొత్తం జన సైనికులతో నిండిపోయింది. అక్కడి నుంచి ర్యాలీగా జనవాణి చేపట్టే ప్రాంతానికి పవన్‌ను తీసుకెళ్లాలని జనసైనికుల ప్లాన్. అదే టైంలో విశాఖ గర్జన ముగించుకొని అమరావతి బయల్దేరిన మంత్రులు అటు చేరుకున్నారు. అటుగా వస్తున్న మంత్రులను చూసిన జన సైనికులు.. పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. జగన్‌కు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

పోలీసులు జనసైనికులను పక్కకు తప్పించి మంత్రులను సేఫ్‌గా ఎయిర్‌పోర్టులోకి పంపించారు. ఇంతలో పవన్ బయటకు రావడంతో జనజైనికులు అక్కడి నుంచి వెళ్లడం స్టార్ట్ చేశారు. పవన్ చూసిన జనసైనికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ జీప్‌లో వారి వెంట కదిలారు పవన్ కల్యాణ్.

 

 

 

Exit mobile version