Site icon Prime9

Ap High Court: గ్రామ స్థాయిలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అధికారాలు ఉన్నాయా? ఏపీ హైకోర్టు

At the village level...are there any powers in the office of the Sub-Registrar AP High Court

At the village level...are there any powers in the office of the Sub-Registrar AP High Court

Amaravati: ఉన్న కేసుల్లోనే పలు మొట్టికాయలు తింటున్న ప్రభుత్వ పనితీరు మారదంటూ ఏపీ హైకోర్టులో మరో కేసు దాఖలైంది. గ్రామస్థాయిలో వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పించడం పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామ ప్రసాద్ వ్యాజ్యం ధాఖలు చేశారు. దీనిపై పిటిషన్ తరపున న్యాయవాది, ప్రభుత్వ తరపున న్యాయవాదులు కోర్టుకు తమ వాదనలు వినిపించారు.

రిజిస్ట్రేషన్ చట్టాలకి వ్యతిరేకంగా కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పించడం చట్ట విరుద్దమన్నారు. గ్రామస్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారాలు తీసివేయటం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

దీంతో ఏ అధికారంతో వార్డు సెక్రటరీలు సబ్ రిజిస్టార్ కార్యకలాపాలు నిర్వహిస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మసనం ప్రశ్నించింది. కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే అధికారాలు కట్టబెడితే సబ్ రిజిస్ట్రార్ విధులు ఎలా నిర్వహిస్తారన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సంబంధించి అధికారాలు కొనసాగుతున్నాయా? లేవా? కోర్టుకు తెలిపాలంటూ ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశిస్తూ,  తదుపరి విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: రుషికొండ కేసు.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Exit mobile version