Site icon Prime9

AP Special Status Case : కొడాలి నాని, వంగవీటి రాధా, పార్థసారథిలకు అరెస్ట్ వారెంట్ జారీ.. ఎందుకంటే ???

arrest warrant on kodali nani and parthasarathy, vangaveeti radha

arrest warrant on kodali nani and parthasarathy, vangaveeti radha

AP Special Status Case : వైకాపా ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్ధసారధి.. తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ లకు ప్రజాప్రతినిధుల కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ 2015 ఆగస్టు 29వ తేదీన వైసీపీ బంద్ పిలుపులో భాగంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో 55 మందిపై కేసు నమోదైంది.

ఇందులో ఏ1గా పార్థసారథి, ఏ2గా కొడాలి నాని, ఏ3గా వంగవీటి రాధా(అప్పట్లో వైసీపీలో ఉన్నారు) పేర్లతో పాటు మరో 52 మంది నేతలు ఉన్నారు. వీరిపై ఐపీసీలోని సెక్షన్లు 341, 188, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.  అయితే ఈ కేసుకు సంబంధించి విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుంది. మంగళవారం రోజు జరిగిన విచారణకు కొడాలి నాని, పార్థసారథి, వంగవీటి రాధా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశగా మారింది.

vangaveeti radha, kodali nani

Exit mobile version
Skip to toolbar